ⓘ ఓజోన్

ఓజోన్ క్షీణత

సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను దిగువ స్ట్రాటోస్ఫియరులో ఉండే ఓజోన్ వాయువు శోషించుకుని భూమిని రక్షిస్తుంది. ఓజోన్ సాంద్రత అధిక మోతాదులో ఉండే ఈ ప్రాంతాన్ని ఓజోన్ పొర అని, ఓజోన్ కవచం అనీ అంటారు. ఈ ఓజోన్ పొరలో ఓజోన్ సాంద్రత తగ్గడాన్ని ఓజోన్ క్షీణత అని అంటారు. ఓజోన్ క్షీణతకు సంబంధించి 1970 ల చివరి నుండి గమనించిన రెండు సంఘటన లున్నాయి: భూ వాతావరణంలోని మొత్తం ఓజోన్‌లో నాలుగు శాతం క్రమంగా తగ్గడం ఒకటి, వసంతకాలంలో భూమి ధ్రువ ప్రాంతాల చుట్టూ స్ట్రాటోస్ఫియరు లోని ఓజోన్‌లో పెద్దయెత్తున తగ్గుదల రెండోది. ఈ రెండో దృగ్విషయాన్ని ఓజోన్ రంధ్రం అంటారు. ఈ స్ట్రాటోస్ఫియరు సంఘటనలతో పాటు వసంతకాలంలో ధ్రువీయ ట్రో ...

ఓజోన్ పొర

ఓజోన్ పొర ఓజోన్ కవచం భూమి యొక్క స్ట్రాటో ఆవరణలోని ఒక ప్రాంతం, ఇది సూర్యుని యొక్క అతినీలలోహిత వికిరణాన్ని గ్రహిస్తుంది. స్ట్రాటో ఆవరణలోని ఇతర వాయువులకు సంబంధించి ఇది ఇప్పటికీ చిన్నది అయినప్పటికీ, వాతావరణంలోని ఇతర భాగాలకు సంబంధించి ఓజోన్ అధిక సాంద్రతను కలిగి ఉంటుంది. ఓజోన్ పొరలో ఓజోన్ మిలియన్‌కు 10 భాగాల కన్నా తక్కువ ఉంటుంది, మొత్తం భూమి యొక్క వాతావరణంలో ఓజోన్ గా సాంద్రత సగటున మిలియన్‌కు 0.3 భాగాలు. ఓజోన్ పొర ప్రధానంగా స్ట్రాటో ఆవరణ యొక్క దిగువ భాగంలో, భూమికి సుమారు 15 నుండి 35 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది, అయినప్పటికీ దాని మందం కాలానుగుణంగా భౌగోళికంగా మారుతుంది. అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్ష ...

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.

సెప్టెంబర్ 16

1923: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా పిలుస్తారు. మ.2015 1975: మీనా, దక్షిణ భారత సినిమా నటి. 1916: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. మ.2004 1969: ప్రమీలా భట్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి. 1857: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి. మ.1928

భూమి వాతావరణం

భూమి వాతావరణం, భూమ్యాకర్షణ శక్తి వల్ల భూమిని అంటిపెట్టుకుని ఉన్న వాయువులతో నిండి ఉన్న పొర. భూమిని ఆవరించి ఉన్న ఈ పొరలో సుమరుగా 78.08% నత్రజని, 20.95% ఆమ్లజని, 0.93% ఆర్గాన్, 0.038% కార్బన్ డై ఆక్సైడ్, అటూఇటుగా ఒక శాతం నీటి ఆవిరి, అతిస్వల్ప పరిమాణాలలో ఇతర వాయువులు ఉన్నాయి. ఈ వాయువుల కలయికను సాధారణంగా గాలి అని పిలుస్తారు. భూమిపైన ఉన్న జీవరాసులను అతినీలలోహిత కిరణాల బారినుండి కాపాడటానికి మరియూ పగలు/రాత్రుల ఉష్ణోగ్రతలను విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవకుండా చూడాటానికి ఈ వాతావరణం ఎంతయినా అవసరం. ఫలానా చోట భూవాతావరణం అంతమై అంతరిక్షం మొదలౌతుందని విభజన రేఖ గీయటం కష్టం, అంతరిక్షం దగ్గరౌతున్నకొద్దీ వాతావ ...

సెప్టెంబరు

సెప్టెంబరు, సంవత్సరంలోని ఆంగ్లనెలలులో తొమ్మిదవ నెల. ఈ నెలలో 30 రోజులు ఉన్నాయి.రోమన్ క్యాలెండరు ప్రకారం అసలు సంవత్సరంలో సెప్టెంబరు ఏడవ నెలగా ఉండేది.దానిపేరు ఇక్కడే నిర్ణయించబడింది.తరువాత క్యాలెండరు‌కు జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చినప్పుడు ఇది తొమ్మిదవ నెలగా మారింది.బ్రిటిష్ వారు 1752 లో జూలియన్ క్యాలెండరు నుండి గ్రెగోరియన్ క్యాలెండరుకు మారినప్పుడు, నెలలతో సీజన్లను సమలేఖనం చేయడానికి వారు కొన్ని రోజులు సర్దుబాటు చేసారు.సెప్టెంబరు నెల నుండి నేరుగా సెప్టెంబర్ 3 నుండి 14 వరకు 11 రోజులు తీసుకున్నారు.1752 లో సెప్టెంబర్ 3, 13 మధ్య రోజులు బ్రిటిష్ చరిత్రలో ఎన్నడూ జరగలేదు.

క్లోరిన్ మొనాక్సైడ్

క్లోరిన్ మొనాక్సైడ్‌ అనునది ఒక రసాయన రాడికల్.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం ClO.మొనాక్సైడ యొక్క మోలార్‌మాస్ 51.4524 గ్రాములు/మోల్. క్లోరిన్, ఆక్సిజన్ మూలకాల సమ్మేళనం వలన ఈ సంయోగపదార్ధం ఏర్పడినది.క్లోరిన్ మొనాక్సైడును క్లోరిన్ ఆక్సైడ్ అనికూడా అంటారు. వాతావరణంలోని ఓజోన్ పొర యొక్క క్షీణతకు, సాంద్రత తగ్గుటకు/నాశనం అగుటకు కారణమైన వాటిలో, ప్రభావం చూపించు రసాయనాలలో క్లోరిన్ మొనాక్సైడు ప్రధానమైనది. భూవాతావరణంలోని వాయువులలో 24% వరకు ఆక్సిజన్ వాయువు ఉందన్న విషయం తెలిసినదే.వాతావరణంలో ఆక్సిజన్ విడిగాను, ఇతరమూలకాలతో కలసి మోనాక్సైడు, డయాక్సైడురూపాలలో ఉండును. ఉదాహరణకు కార్బన్ మొనాక్సైడ్ CO, కార్బన్ ...

సూర్యరశ్మి

సూర్యుని నుండి భూమిని చేరే కాంతిని సూర్యరశ్మి అంటారు. ఇది సూర్యుని నుండి వెలువడే విద్యుదయస్కాంత వికిరణాలలో ఒక భాగం. ప్రత్యేకంగా చెప్పాలంటే పరారుణ కిరణాలు, దృగ్గోచర వర్ణపటం, అతినీలలోహిత కిరణాలు యొక్క సముదాయం అని చెప్పవచ్చు.భూమిపై సూర్యుని నుండి వచ్చే సూర్యకాంతి వాతావరణం వల్ల వడపోయబడుతుంది.సూర్యుని నుండి వెలువడే సూర్యుని వికిరణాలు మేఘాల వల్ల మూయబడక పోతే సూర్యకాంతి భూమిని చెరుతుంది. సూర్యకాంతి అనునది ప్రకాశవంతమైన కాంతి, ఉష్ణ వికిరణాల సముదాయం. ప్రపంచ వాతావరణ స్ంస్థ ఈ పదాన్ని "sunshine duration" అని వాడుతుంది. అనగా భూమిపై ఒక ప్రదేశంలో సూర్యుని నుండి పొందిన వికిరణాకు కనీసం 120 వాట్లు/సెకండ్ వైశా ...

భిన్నరూపత

గ్రీకు భాషలో "అల్లోస్" అనగా "వేరే", "ట్రోపోస్" అనగా "రూపాలు" అని అర్థం కనుక భిన్నరూపత అంటే allotrophy. కొన్ని రసాయన మూలకాలు ఒకే భౌతిక స్థితిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు రూపాల్లో వుండేటటువంటి గుణమును భిన్నరూపత అని అంటారు. వీటిని రూపాంతరాలు అని పిలుస్తారు. ఒక మూలకం యొక్క నిర్మాణములో వివిధ మార్పులతో వుంటాయి ఈ రూపాంతరాలు. అనగా ఆ మూలకం యొక్క అణువులు వివిధ పద్ధతులలో అమర్చబడి ఉంటాయి. ఈ సందర్భంలో రెండు సాంకేతిక పదాల అర్థాలలో తేడా గమనించడం అవసరం. ఒకటి బహురూపత polymorphism, రెండవది భిన్నరూపత allotropy. ఒకే పదార్థం రెండు లేదా, రెండు కంటె ఎక్కువ స్పటికాకారాలని ప్రదర్శించగలిగితే దానిని బహురూపత ...

అంటార్కిటికా

అంటార్కిటికా భూమికి అత్యంత దక్షిణ కొసన ఉన్న ఖండం. ఇక్కడే భౌగోళిక దక్షిణ ధ్రువం ఉంది. ఇది దక్షిణార్ధగోళం లోని అంటార్కిటిక్ ప్రాంతంలో ఉంది, అంటార్కిటిక్ వలయానికి దాదాపు పూర్తిగా దక్షిణంగా ఉంది. దక్షిణ మహాసముద్రం ఈ ఖండాన్ని పరివేష్ఠించి ఉంది. 1.42.00.000 చ.కి.మీ విస్తీర్ణంతో, ఇది ఐదవ అతిపెద్ద ఖండం. ఆస్ట్రేలియాకు దాదాపు రెండు రెట్లు ఉంటుంది. చదరపు కిలోమీటరుకు 0.00008 మంది జనాభాతో, ఇది తక్కువ జనసాంద్రత కలిగిన ఖండం. అంటార్కిటికా 98% ఐసుతో కప్పబడి ఉంటుంది. ఈ ఐసు సగటు మందం 1.9 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తర కొస వరకూ విస్తరించి ఉంది. అంటార్కిటికా అత్యంత శీతలంగా, అత్యంత పొడి ...

అన్నా మణి

అన్నా మణి భారత దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. ఈమె భారత వాతావరణ శాఖ, పూణెలో డిప్యూటీ డైరక్టర్ జనరల్ గా ఉన్నారు. ఈమె వాతావరణ పరికరాలపై విశేష కృషిచేశరు. ఈమె సౌరశక్తి, పవన శక్తి, ఓజోన్ పొరపై అనేక పరిశోధనలు నిర్వహించి అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

వాయు కాలుష్యం

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము ను కలుషితం చేయు రసాయనము లు, నలుసు పదార్థము లు, లేక జీవపదార్దము లు వాతావరణము లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి Earthపై నున్న జీవరాశులకు అనుకూలమైనది. వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియరులో ఓజోన్ తగ్గుదల మానవుల ఆరోగ్యానికే కాక భూమియొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు ecosystems కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.

                                     

ⓘ ఓజోన్

ఆమ్లజని మరో రూపమే ఓజోన్‌. ఇది విషవాయువు. ప్రతీ ఓజోన్‌ అణువులోను మూడు ఆమ్లజని పరమాణువులున్నాయి. దీని రసాయన సాంకేతికం O3 అతినీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణం పై పొరలో ఆక్సీజన్‌ అణువులు విడిపోతాయి. స్వేచ్ఛగా ఉన్న ఆక్సీజన్‌ పరమాణువు, తాడితంతో ఆక్సీజన్‌ అణువులోకి చేరి ఆక్సీజన్‌ పరమాణువులుగా మారి ఓజోన్‌ అణువవుతుంది.

                                     

1. ఓజోన్‌ లాభ నష్టాలు

వాతావరణపు గాలి పొరలో భూ ఉపరితలానికి సుమారుగా 15 - 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఓజోన్‌ సహజంగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకొని జీవరాశిని రక్షిస్తుంది. వాహనాల కాలుష్యం నైట్రోజన్‌ ఆక్సైడ్‌ల హైడ్రో కార్బన్‌ల స్థాయిలు పెరగడం వల్ల వాతావరణపు పైపొర భూఉపరితలానికి దగ్గర అయింది. సూర్యరశ్మిలో ఈ రసాయనాలు ఓజోన్‌గా మారతాయి. దగ్గు, గొంతు నొప్పి, ఉబ్బసవ్యాధిని పెంచడం శ్వాస కోశ వ్యాధులు మొదలగు సమస్యలను ఈ ఓజోన్‌ కల్గిస్తుంది. పంటలను కూడా నాశనం చేస్తుంది. వాతావరణపు గాలి పొరలో గల ఓజోన్‌ భూమిపై నున్న జీవరాశిని సూర్యుని నుండి వచ్చే అతినీలలో హిత కిరణాల నుండి రక్షిస్తుంది.

వాతావరణానికి దిగువున ఉన్న ఓజోన్‌ ఆరోగ్య సమస్యలను కల్గిస్తుంది.

ఓజోన్‌ తరిగిపోవడమంటే ఏమిటి?
  • రెండవ దశః సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సి.ఎఫ్‌.సిని విచ్చిన్నం చేసి క్లోరీన్‌ని విడుదల చేస్తాయి.
  • క్లోరో ప్లూరో కార్బన్‌లు CFCs ఓజోన్‌ తరుగుదలకు ప్రాథమిక రసాయనాలు. రిఫ్రిజరేటర్లలో ఎయిర్‌ కండీషన్‌ మొదలగు వాటిలో రిఫ్రిజెంట్లుగా ఉంటాయి.ఇవి క్లోరీన్‌ను కల్గి ఉంటాయి.
  • మూడవ దశః ఈ క్లోరీన్‌ పరమాణువులు ఓజోన్‌ అణువును విచ్చిన్నం చేసి ఓజోన్‌ తరిగి పోయేటట్లు చేస్తాయి.
                                     

2. ఓజోన్‌ తరిగి పోవడం వల్ల మన పై ప్రభావం ఎలా ఉంటుంది?

ఓజోన్‌ పొర తరిగి పోవడం వల్ల అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకడం అధికం అవుతుంది. దీని వల్ల జన్యువులు, కళ్ళు దెబ్బ తినడంతో పాటు సముద్ర జీవరాశి పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.

                                     

3. ప్రపంచ ఓజోన్ దినం

1994లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్‌పై సంతకం చేసిన తేదీకి జ్ఞాపకార్థంగా దీనిని నిర్వహించాలని నిర్ణయించారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →