ⓘ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం

నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్

నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, నరసరావుపేట పట్టణంలోని స్థానిక బరంపేటలో నెలకొనిఉంది.ఈ ఆలయంలోని ప్రధాన దైవం కృష్ణుడు,ప్రధాన దేవత రాధ.

ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద

పరమపూజ్య శ్రీ ఎ.సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు సన్యాసిగా, కృష్ణ భక్తునిగానూ ప్రసిద్దులు.ఇతను అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం సంస్థాపకాచార్యులు.ఈ సంఘం సాధారణంగా "హరేకృష్ణ ఉద్యమం"గా ప్రసిద్ధి పొందింది.

ఉండవల్లి

ఉండవల్లి, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం విజయవాడ నగరానికి ఒక ప్రధాన శివారు ప్రాంతము. ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాలలో ఒకటి. నూతన అమరావతికి తూర్పు ముఖద్వారము మఱియు ముఖ్యమైన మార్గము. పిన్ కోడ్ నం. 522501., ఎస్.టి.డి. కోడ్ = 08645.

కొండవీడు

కొండవీడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన గ్రామం. చరిత్రలో రెడ్డి రాజుల రాజధాని. ఇక్కడి పురాతన కోట వలన ప్రముఖ పర్యాటక కేంద్రం.

పాలకోడేటి సత్యనారాయణరావు

పాలకోడేటి సత్యనారాయణరావు, రచయిత, కవి, బుల్లితెర దర్శకుడు,అనువాదకుడు.ఇతను 27 గ్రంథాలు, 100 మించిన సంఖ్యలో కథలు రచించాడు.పాలకోడేటి సత్యనారాయణ రావు,పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం గ్రామంలో 1948 డిసెంబరు 28న జన్మించాడు.తల్లి అలివేలు మంగతాయారు,తండ్రి అప్పారావు. చిత్తూరు జిల్లా, పెనుమూరులో ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది.మాధ్యమిక విద్యాభ్యాసం కొంత కార్వేటినగరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తర్వాత మిగిలిన విద్యాభ్యాసం అంతా హైదరాబాదులో జరిగింది.హైదరాబాదులోని నాన‌క్‌రామ్‌ భగవాన్‌దాస్ సైన్స్ కళాశాలలో బి. యస్. సి. చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ లో ఎం.ఎస్.సి. టెక్, తర్ ...

పిల్లలు

ఇంకా యుక్త వయసు రాని అమ్మాయిలను, అబ్బాయిలను పిల్లలు లేదా బిడ్డలు అంటారు. అయితే, తల్లితండ్రులు తమ సంతానాన్ని ఎంతటి వయసు వారైనా పిల్లలు అని అంటారు. మానవ జీవితంలో ఈ దశను బాల్యం అంటారు. యవ్వన లక్షణాలు కొంతమంది పిల్లలలో తొందరగా వస్తాయి. ఈ పదం ఒకవిధంగా ఆలోచిస్తే ఏ వయసుకు చెందినవారికైనా వర్తిస్తుంది. ఉదా. పెద్దవాళ్ళు కూడా వారి తల్లిదండ్రులకు పిల్లలే కదా. ఇది పిల్ల మొక్కలకు కూడా వాడవచ్చును. ఒకేసారి పుట్టిన పిల్లలను కవలలు అంటారు.

గొల్లపూడి (విజయవాడ గ్రామీణ)

గొల్లపూడి, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ = 521 225., ఎస్.టి.డి.కోడ్ = 0866. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విజయవాడ యొక్క పొరుగు ప్రాంతం గొల్లపూడి.

కాకినాడ

కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. డెన్మార్క్ నగరము మాదిరిగా వీధులు జిగ్ జాగ్ చేసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి బంగారు రంగులో ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ అనకాపల్లి గానూ, చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ ఇరాన్ గానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్గా పేరొందినది. ఆంధ్రప్రదేశ్ పెట్రోల ...

మాలపల్లి (నవల)

ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవల సాహిత్య వైతాళికుడు అయిన శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణచే 1922 లో తెలుగులో రచించబడిన ‘మాలపల్లి’ నవల ఆంధ్ర ప్రదేశ్ లో కులవర్గ దృక్పధంతో వెలువడిన తొలి అభ్యుదయ కావ్యం. జాతీయోద్యమంలో భాగంగా పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని జైలు పాలైన ఉన్నవ లక్ష్మినారాయణ రాయవెల్లూరు జైలులో వుండగా ఈ నవలను దేశభక్తి పూరితంగా సంఘసంస్కరణాభిలాషతో రచించారు. ఈ మాలపల్లి నవల ప్రగతి శీలక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మేలిమలుపుగా, సామాజిక దృక్పథంలో ఒక ముఖ్య ఘట్టంగా, సంఘ సంస్కరణ సాహిత్యంలో ప్రామాణికంగా నిలిచింది. ఈ నవల మార్క్సిస్టు భావజాలంతో జాతీయోద్యమ ప్రభావంతో వచ్చినా, సమున్నత ...

                                     

ⓘ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం లేదా ఇస్కాన్, దీనికి హరేకృష్ణ ఉద్యమం అనికూడా అంటారు. ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతా ప్రచారం, కృష్ణ తత్వములను భక్తి యోగములను ప్రచారము చేస్తుంటారు. భారతదేశమునందున ప్రతి ప్రధాన నగరములందున వీరి కృష్ణ మందిరములు ఉన్నాయి.

                                     

1. ముఖ్య ఉద్దేశ్యాలు

1966లో ఇస్కాన్ స్థాపించినపుడు, శ్రీల ప్రభుపాద, 7 ముఖ్య ఉద్దేశ్యాలను ప్రకటించాడు.

 • భక్తుల కొరకు, ఆధ్యాత్మిక భవనాలను నిర్మించడం.
 • ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించడం. ప్రజలలో ధార్మిక చింతనను అలవర్చడం. ప్రపంచంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడం.
 • కృష్ణ భక్తులను పెంచడం. వీరిని ఒక వేదికపై తీసుకురావడం, మానవతావాదాన్ని పెంచడం, తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం.
 • కృష్ణ తత్వాన్ని, భగవద్గీత ప్రవచనాలనూ శ్రీమద్‌భాగవతాన్ని ప్రచారం చేయడం.
 • పై ఉద్దేశ్యాలను జనబాహుళ్యంలోకి తీసుకు వెళ్ళుటకు, పత్రికలను ప్రచురించడం, గ్రంథాలను రచించడం.
 • భక్తులను, సభ్యులను దరిచేర్చి, సాత్విక జీవన చైతన్యాన్ని కల్పించడం, సాదాసీదా ప్రాకృతిక జీవన శైలిని అలవర్చడం.
 • సంకీర్తనా ఉద్యమాన్ని ప్రోత్సహించడం, సామూహిక కీర్తనలు చేపట్టడం, తద్వారా చైతన్యమహాప్రభు బోధనలను అమలు పరచడం.
                                     

2. నాలుగు జీవన సూత్రాలు

శ్రీల ప్రభుపాదుడు, నాలుగు జీవన సూత్రాలను సూచించాడు., ఇవి ఆధ్యాత్మిక జీవనానికి మూలాలు:

 • జూదము ఆడరాదు.
 • మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించరాదు.
 • సాత్విక ఆహారపు అలవాట్లు అలవర్చడం, మాంసాహారాన్ని త్యజించడం.
 • వ్యభిచరించరాదు.
                                     

3. ఇస్కాన్ కృష్ణదేవాలయాలు

ఇస్కాన్ సంస్థ అనేక నగరాలలో రాధాకృష్ణ మందిరాలు నిర్మిస్తున్నది. అధునాత, సంప్రదాయ శైలుల మేళవింపుతో నిర్మించిన ఈ ఆలయాలు చక్కని నిర్వహణతో ఆ ఊళ్ళలో భక్తులకు, పర్యాటకులకు సందర్శనా స్థలాలుగా గుర్తింపు పొందుతున్నాయి.

                                     

3.1. ఇస్కాన్ కృష్ణదేవాలయాలు ఇస్కాన్ దేవాలయం, బెంగుళూరు

బెంగుళూరులోని ఇస్కాన్ 1987 సెప్టెంబర్లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమయినది. మధు పండిట్ దాస్ గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న పదకొండు ఎకరాల స్థలం కేటాయించారు. అలా కేటాయింబడిచిన స్థలంలో 1990 - 1997సంవత్సరాల మధ్య గుడి నిర్మాణం జరిగింది. అలా పూర్తయిన గుడి అప్పటి రాష్ట్రపతి, డా.శంకర దయాళ్ శర్మ చేతుల మీదుగా 1997 మే 31న ప్రారంభమయినది.

ఇక్కడ బంగారు పూతతో ఉన్న ద్వజస్తంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ గుడి బెంగుళూరులో రాజాజీనగర్‌ అనే ప్రాంతములో ఉంది.ఆక్కడకు వెళ్ళటానికి, మెజస్టిక్‌ బెంగుళూరు రైల్వే స్టేషను, బస్సు స్టాండు గల ప్రాంతం నుండి సిటీ బస్సులు ఉన్నాయి.

                                     

3.2. ఇస్కాన్ కృష్ణదేవాలయాలు ఇస్కాన్ దేవాలయం, హైదరాబాదు

హైదరాబాదులో ఈ దేవాలయం అబీడ్స్ కూడలి నుండి, నాంపల్లి స్టేషనుకు వెళ్ళే వీధిలో ఉంది. హైదరాబాదు ముఖ్య తపాలా కార్యాలయము G.P.O. నకు చేరువలో ఉంది. ఆలయము కట్టుటకు, స్థలమును ప్రముఖ స్వీట్ దుకాణం పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డిగారు దానం చేశారు.

                                     

3.3. ఇస్కాన్ కృష్ణదేవాలయాలు ఇస్కాన్ దేవాలయం, తిరుపతి

తిరుపతి పుణ్య క్షేత్రములో, కపిలతిర్థమ్ జలపాతం ఉన్న ప్రాంతమునకు దగ్గరలో ఇస్కాన్ కృష్ణ దేవాలయము ఉంది. ఇక్కడ ఈ ఆలయము హరేకృష్ణ ఆలయముగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయమును చాలా శ్రమపడి అందముగా తీర్చి దిద్దారు. ఆలయము చుట్టూ పచ్చిక బయళ్ళు తయారు చేసి సందర్శకులకు చూడచక్కని ప్రదేశముగా తయారు చేశారు. తిరుపతి రైల్వే స్టేషను నుండి ఆటోలో ఈ దేవాలయమునకు వెళ్ళవచ్చును. తిరుమల తిరుపతి దేవస్థానము వారు ప్రతి రోజూ ఆలయ దర్శనము యాత్రలో ఈ అలయాన్ని చూపిస్తారు.                                     

3.4. ఇస్కాన్ కృష్ణదేవాలయాలు ఇస్కాన్ దేవాలయం, ముంబై

ఇక్కడ ఇస్కాన్ దేవాలయములు రెండు చోట్ల ఉన్నాయి. ఒకటి జూహూ ప్రాంతములో సముద్ర తీరమునకు దగ్గరలో. మరొక దేవాలయము గిర్‌గావ్ సముద్ర తీరము దగ్గర మరైన్ డ్రైవ్‌కు దగ్గరలో. ముంబాయి లోకల్ రైల్వే స్టేషన్లలో ఇస్కాన్ కార్యకర్తలు వారు ప్రచురించిన కృష్ణ సాహిత్యాన్ని అమ్ముతూ తరచూ కనిపిస్తూ ఉంటారు.

                                     

3.5. ఇస్కాన్ కృష్ణదేవాలయాలు దేశవ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాలు

 • పశ్చిమ బెంగాల్ లోని కొలకత్తాలో 3సి ఆల్బర్ట్ రోడ్ మింటో పార్క్ వెనుక బిర్లా ఉన్నత పాఠశాల వెనుక ఉన్న శ్రీ శ్రీ రధా గోవింద మందిర్.
 • గుజరాత్‌ లోని అహమ్మదాబాద్‌లో సర్ఖేజ్ గాంధీ నగర్ హైవే భోపాల్ క్రాసింగ్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
 • అస్సామ్ రాష్ట్రం గౌహతి ఉలూబారి చరాలి వద్ద ఉన్న ఇస్కాన్.
 • తమిళ నాడు లోని చెన్నై లోని చోళింగ నల్లూరు ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఉన్న భక్తి వేదాంత స్వామి రోడ్ అక్కరైలో ఉన్న హరే కృష్ణా లాండ్.
 • మహారాష్ట్ర లోని బొంబాయి లోని హరే కృష్ణా అండ్ జుహూ రోడ్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్.
 • ఒడిషా లోని బరంపూర్ లోని గంజమ్ లోని హరే కృష్ణా టెంపుల్.
 • ఉత్తరప్రదేశ్ ఘాజియా బాద్ హరే కృష్ణ మార్గంలో ఉన్న రాజ్ నగర్ వద్ద ఉన్న శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్.
 • ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఉన్న ఇస్కాన్.
 • తమిళనాడు కోయంబత్తూరు హరేకృష్ణా రోడ్ సి ఐ టి కాలేజ్ ఎదురుగా శ్రీ జగన్నాధ్ మందిర్ ఇస్కాన్.
 • మహారాష్ట్ర లోని సంగ్లి జిల్లాలోని హరేకృష్ణా గ్రామ్‌లోని ఇస్కాన్ టెంపుల్.
 • కర్నాటక లోని బెల్‌గమ్ శుక్రవార పేట్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
 • త్రిపురా రాష్ట్రంలోని అగర్తలలోని బనమాలీపుర్‌లో ఉన్న శ్రీ శ్రీ రాధాగోవింద మందిర్.
 • గుజరత్ జామ్‌నగర్ జిల్లా దేవి భవన్ రోడ్ ద్వారకథామ వద్ద ఉన్న స్కాణ్ టెంపుల్.
 • ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్‌లో కాశీరంజ్ నగర్ బాలుఅఘత్ వద్ద ఉన్న శ్రీ శ్రీ రాధా వేణుమాధవ మందిర్.
 • మహారాష్ట్ర ఔరంగాబాద్ లోని సిడ్కో వద్ద ఇస్కాన్ ఔరంగాబాద్ టెంపుల్.
 • ఉత్తరాంచల్ హరిద్వార్ నయీ బస్తీ, మహదేవ్ నగర్ భిమ్‌గోడా వద్ద ఉన్న శ్రీల ప్రభుపాద ఆశ్రమ్.
 • మహారాష్ట్ర గాడ్ చిరోలి జిల్లా లోని ఇస్కాన్ టెంపుల్.
 • ఒడిషా లోని భద్రక్ లోని కౌంష్ భద్రక్ వద్ద ఉన్న గురు గోపాల్ మందిర్.
 • పంజాబ్ రాష్ట్రం లోని ఛంఢీఘర్ లోని దక్షిణ మార్గ్ సెక్టర్ 36-బి లోఉన్న హరే కృష్ణా ధామ్.
 • గుజరాత్ గంగాపుర్ సూరత్-బర్దోలి రోడ్ వద్ద భక్తి వేదాంత రాజవిద్యాలయ.
 • ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నాంపల్లీ స్టేషను రోడ్ లో అబిడ్స్ పుల్లారెడ్డి స్వీటధౌస్ ఎదురుగా ఉన్న
 • మహారాష్ట్ర లోని బీడ్ లోని స్వాతి మాలి ఛౌక్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
 • రాజస్థాన్ భరత్‌పుర్ లోని జీవన్‌ నిర్మన్ సంస్థాన్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
 • ఆంధ్రప్రదేశ్ హనుమకొండ నీలాడీ రోడ్ కపువాదా వద్ద ఉన్న ఇస్కాన్.
 • మహారాష్ట్ర ఉత్తర్ కసాడే అల్కాట్ రోడ్ న్యూ జకనక వద్ద ఉన్న భక్తి వేదాంత్ మార్గ్ వద్ద ఉన్న హరేకృష్ణా లాండ్ 1ఇస్కాన్ సోలాపుర్.
 • ఒడిషా లోని భువనేశ్వర్ ఐ ఆర్ సి వద్ద ఉన్న శ్రీకృష్ణ బలరామ్ టెంపుల్ ఇస్కాన్.
 • గుజరాత్ ద్వారకలో దేవీ భవన్ రోడ్ భారతీయ భవన్ వద్ద ఉన్న ఇస్కాన్ రోడ్.
 • మహారాష్ట్ర లోని అమరావతి లోని సరస్వతీ నగర్ రతి నగర్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్.
 • కర్నాటక లోని బెంగుళూరు లోని శ్రీపురమ్, శేషాద్రి పురమ్ వద్ద ఉన్న ఇస్కాన్ జగన్నాధ్ మందిరమ్.
 • పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాయాపూర్ లో చంద్రోదయ దేవాలయం
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →